TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వస్త్ర వ్యాపారులకు చంద్రబాబు పిలుపు

Published on: Wed Feb 1, 2012 9:34AM

హైదరాబాద్ : వస్త్ర వ్యాపారంపై వ్యాట్ వేసి వేధిస్తున్న కాంగ్రెస్ నేతలకు దుస్తులు అమ్మకుండా నిరసన వ్యక్తం చేయాలని వస్త్ర వ్యాపారులకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. 'వారికి వస్త్రాలు విక్రయించకండి. దుస్తుల్లేకుండా అసెంబ్లీకి రావాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు వీళ్ల కళ్లు తెరుచుకొంటాయి. ఢిల్లీకి సెగ తగిలేలా పోరాడండి. అప్పుడే ఇక్కడ ప్రభుత్వం కదులుతుంది' అన్నారు. వ్యాట్ విధింపునకు నిరసనగా 9 రోజులుగా వస్త్ర వ్యాపారులు ఇందిరాపార్కు వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఆయన మంగళవారం పాల్గొన్నారు.వస్త్ర వ్యాపారుల కోరికలో న్యాయం ఉందన్నారు. 'దేశమంతటా ఈ పన్ను విధిస్తే ఇక్కడా విధించాలని, లేకపోతే ఎత్తేయాలని వ్యాపారులు కోరారు. ఈ పన్నువల్ల ఇక్కడ తయారైన వస్త్రాల ధర పొరుగురాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ ఉంటుంది. దాంతో అమ్మకాలు తగ్గుతాయి. ఇక్కడి పరిశ్రమలూ తరలిపోతాయి. కొత్త ఉద్యోగాలు ఇస్తామనే ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టడమేమిటి? కొన్ని రాష్ట్రాలు ఈ పన్ను విధించినా పరిస్థితి అర్థం చేసుకొని ఉపసంహరించాయి. కేంద్రం కూడా ఈ పన్ను విధించవద్దని సలహా ఇచ్చింది.

మన రాష్ట్రం అక్కడ తలఊపి, ఇక్కడ వేస్తోంది. ఇదొక చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. పన్నులతోనే ఆదాయం వస్తుందన్న కక్కుర్తితో రకరకాల పన్నులతో బాదుతున్నారు' అని ఆయన విమర్శించారు.'మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది. మా ప్రభుత్వం వస్తే వ్యాట్ వేయం.ఈ విషయం ఎన్నికల ప్రణాళికలో కూడా పెడతాం' అని ప్రకటించారు.కాగా, ప్రజలను రెడీమేడ్ దుస్తుల వైపు మళ్లించేందుకే వస్త్రాలపై వ్యాట్‌ను పెట్టారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. పంచెలు, చీరలు కట్టుకునేవారిపైనా దీని ప్రభావం పడుతుందన్నారు. వ్యాట్ అనేది కుట్టని వస్త్రాలపైనే వేస్తున్నారని గుర్తు చేశారు.