TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముసలి దర్శకుడికి డేటింగ్ పండగ!

Published on: Fri Jun 13, 2014 6:09PM

 

 

 

మనదేశంలో దసరా ఎంత సరదాగా జరుగుతుందో, అమెరికాలో డేటింగ్ అంత సరదాగా జరుగుతుంది. ఇండియాలో ఎవరైనా ముసలాయన ఆ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తుంటే ‘ముసలోడికి దసరాపండగ’ అంటాం. అదే అమెరికా ముసలాయన డేటింగ్ విషయంలో ఫాస్ట్.గా వుంటే ‘ముసలోడికి డేటింగ్ పండగ అనొచ్చేమో’. హాలీవుడ్‌లో ఓ ముసలి దర్శకుడు 84 ఏళ్ళ వయసులో డేటింగ్ చేస్తూ వుండటం అక్కడ హాట్ టాపిక్‌గా మారింది. ఆ ముసలి దర్శకుడు వేరెవరో కాదు.. క్లింట్ ఈస్ట్ వుడ్! ఈయనగారు కాల్నిఫోర్నియాలోని ఓ హోటల్ ఉద్యోగితో డేటింగ్ చేస్తున్నట్టు ఆంగ్ల ప్రతికలు, వెబ్ సైట్లు కోడై కూస్తున్నాయి. హాలీవుడ్ దర్శకుడు క్లింట్ ఈస్ట్ ఉడ్, హోటల్ ఉద్యోగి సాండెరా ఇద్దరు కలిసి అన్యోన్యంగా సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తూ, ముద్దులు పెట్టుకుంటూ మీడియా కంటపడ్డారు. పెద్దాయన ఈ డేటింగ్ వ్యవహారం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాడట. ఈ ముసలాయన వరస చూసి హాలీవుడ్‌లో అందరూ నోళ్లు నొక్కుకుంటున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా క్లింట్ ఈస్ట్ వుడ్ తన గర్ల్ ఫ్రెండ్‌తో షికార్లు కొడుతున్నాడు. గర్ల్ ఫ్రెండ్‌ సాండెరాని పెళ్ళి చేసుకోవడానికి వీలుగా తన భార్యకి విడాకులు ఇచ్చే ఆలోచనలో కూడా ఈస్ట్ వుడ్ వున్నట్టు సమాచారం.