TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గుంటూరులో గుబులురేపుతున్న క్లీనికల్‌ ల్యాబ్‌లు

Published on: Fri Jun 29, 2012 12:38PM

గుంటూరులో క్లీనికల్‌ల్యాబ్‌లు రోగులకు గుబులుపుట్టిస్తున్నాయి. ఉన్న జబ్బు లేనట్లుగానూ, లేని జబ్బు ఉన్నట్లుగానూ తప్పుల తడకల రిపోర్టులను అందిస్తున్నాయి. ఇటీవల ఓ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు ఎయిడ్స్‌ ఉన్న దంపతులు వెళితే వారికి క్లీన్‌చిట్‌ లభించింది. హెపటైటీస్‌`బి లేకపోయినా ఉన్నట్లు ఒక క్లీనికల్‌ల్యాబ్‌ నివేదిక ఇచ్చేసింది. దీంతో ఈ బాధితుడు జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారిని కలిసి ఫిర్యాదు చేశాడు. తమ వ్యాపారం పెంచేందుకు వైద్యులకు 30శాతం ఆఫర్‌ చేస్తున్న ల్యాబ్‌లు, డయోగ్నోస్టిక్‌ సెంటర్లు కోట్లు సంపాదించాలనే కసి కొద్దీ పని చేస్తున్నాయి. జిల్లాలో 500 ల్యాబ్‌లు, డయోగ్నోస్టిక్‌ సెంటర్లున్నాయి. ఇంకా ఆసుపత్రులకు అనుబంధంగా 400ల్యాబ్‌లు పని చేస్తున్నాయి. మొత్తం 900 ల్యాబ్‌ల్లో 660సెంటర్లను స్మాల్‌స్కేల్‌ కింద, 200 సెంటర్లను మీడియం కింద, 20 సెంటర్లను లార్జ్‌ స్కేల్‌ కింద గ్రేడిరగ్‌ చేశారు. ఈ గ్రేడిరగ్‌లో కూడా రోజుకు వంద వరకూ పరీక్షలు నిర్వహించేవాటిని స్మాల్‌ కింద, 505 వరకూ పరీక్షలు చేసేవాటిని మీడియం కింద, ఆపైన  ఎక్కువ పరీక్షలు చేసేవాటిని లార్జి కింద గుర్తించారు. అయితే ఈ సెంటర్లను జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో రిజిస్టర్‌ చేసుకుని ఆయన సూచనల ప్రకారం నడపాలి. ఇప్పటి వరకూ అటువంటి గుర్తింపు పొందిన ల్యాబ్‌ ఒక్కటి కూడా లేదని  ప్రచారమైంది.