నరేంద్ర మోడీకి అహ్మదాబాద్ కోర్టు క్లీన్ చిట్

 

 

 

రెండువేల రెండులో జరిగిన అల్లర్ల కేసులో బిజెపి ప్రధాని అభ్యర్ధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఉరట లభించింది. గోద్రా అల్లర్ల ఘటనపై మోడీకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) క్లీన్ చిట్ ఇవ్వడంపై జకియా జాఫ్రీ అహ్మదాబాద్ కోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందా అన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా ముఖ్యంగా బిజెపి శ్రేణులలో నెలకొంది. వారికి ఊరట ఇచ్చేవిధంగా కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.


అంతకుముందు గోద్రా అల్లర్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) విచారణ చేపట్టింది. 2008 మార్చి 8వ తేదీన సుప్రీం కోర్టు సిట్‌ను నియమించింది. నాలుగేళ్ల పాటు విచారణ జరిపిన సిట్ 2012 ఫిబ్రవరిలో అల్లర్లలో మోడీ పాత్ర లేదంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిని జకియా న్యాయస్థానంలో సవాల్ చేసింది.