TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ నేతల మధ్య ఘర్షణ.. ఒకరికి తీవ్ర గాయాలు!!

Published on: Wed Jun 19, 2019 11:42AM

 

గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జిల్లాలోని నాదెండ్ల మండలం సాతులూరులో ‘మీ సేవా’ కేంద్రం ఏర్పాటు అయింది. అయితే దీన్ని మేం నిర్వహిస్తాం.. అంటే మేం నిర్వహిస్తాం అని స్థానిక వైసీపీ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి వాదులాడుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం కాస్తా హద్దుదాటడంతో రెండు గ్రూపులు కర్రలు, రాళ్లతో దాడిచేసుకున్నాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా, బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.