TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇలాంటి తీర్పులు కూడా ఉంటాయా? తలపట్టుకున్న సీజేఐ

Published on: Thu May 18, 2023 1:55PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పట్టికుదిపేస్తున్న వివేకా హత్య కేసులో రోజుకో ట్విస్టు బయటపడుతోంది.  అలాగే ప్రతి అంశమూ ఆసక్తిగా మారుతోంది.  చివరికి హైకోర్టు సుప్రీం కోర్టులను కూడా ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తన్న వివేకా హత్య కేసులో తాజాగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గత కొంత కాలంగా బెయిలుపై ఉన్న వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడు గంగిరెడ్డి బెయిలును రద్దు చేస్తూ  ఈ నెల 5వ తేదీలోగా లొంగిపోవాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఈ నెల 5న లొంగిపోయారు. అప్పటి నుంచీ జైలులోనే ఉన్నారు. 

అయితే తాజాగా ఎర్రగంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు  గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది.  గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన హైకోర్టు జులై 1న మళ్లీ విడుదల చేయాలని సిబిఐ కోర్టుకు ఉత్తరువులు ఇచ్చింది. వివేకా హత్య కేసులో జూన్ 30వ తేదీతో దర్యాప్తు ముగించాలని సుప్రీం ఆదేశించినందువల్ల జులై 1న గంగిరెడ్డిని బెయిల్ పై విడుదల చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సుప్రీం ను ఆశ్రయించారు. సునీత పిటిషన్ ను విచారించిన సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాంటి తీర్పులు కూడా ఉంటాయా అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తల పట్టుకున్నారు.  ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి విచారణను వెకేషన్ బెంచ్ కు బదిలీ చేశారు. ఈ కేసు విచారణ వచ్చే వారం వెకేషన్ బెంచ్ చేపట్టనుంది.