లైంగిక వేధింపుల కేసు.. చీఫ్ జస్టిస్ కు క్లీన్ చిట్
Published on: Mon May 6, 2019 6:00PM

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కు క్లీన్ చిట్ వచ్చింది. ఆయనపై వచ్చిన లైంగిక ఆరోపణలను సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ తోసిపుచ్చింది. మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణల్లో నిజం లేదని జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. సీజేఐని ఇరికించేందుకే ఈ విధమైన ఆరోపణలు చేశారని తెలిపింది. ఈ అంశంపై గత కొన్నిరోజులుగా విచారణ జరిపిన కమిటీ.. మహిళా ఉద్యోగినిని వివిధ కోణాల్లో ప్రశ్నించింది. ఆమె ఇచ్చిన సమాధానాలను, వార్తా పత్రికలకు ఇస్తున్న పలు ఇంటర్వ్యూలను పరిశీలించిన మీదట ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది.


