TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యుద్ధం ఆపమని పుతిన్‌ను అడగగలనా?.. 'పిల్'పై సీజేఐ విస్మయం!

Published on: Thu Mar 3, 2022 1:42PM

ఉక్రెయిన్- రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. కనుచూపు మేరలో ముగింపు కనిపించడం లేదు. చివరకు ఏ మలుపు తిరుగుతుందో కూడా తెలియడం లేదు. ఈ నేపధ్యంలో, ఉక్రెయిన్’లో చిక్కుకుపోయిన  భారతీయులు, భారతీయ  విధ్యార్ధుల యోగక్షేమాల గురించి సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం, భారతీయులు అందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకు వచ్చేందుకు, చేయగల అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో  రష్యా అధ్యక్షుడు పుతిన్’ భారతీయులు, సరిహద్దులకు చేరుకునేదుకు వీలుగా, సేఫ్ పాసేజ్ కోసంగా ఆరు గంటల యుద్ద విరామాన్ని ప్రకటించారు. ఉక్రెయిన్‌లో మొత్తం 20 వేల మంది మన భారతీయులు చిక్కుకుపోగా ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకూ 12 వేల మందికిపైగా స్వదేశానికి చేరుకున్నారు. రానున్న ఒకటి రెండు రోజుల్లోనే, మిగిలిన ఎనిమిది వేల మంది కూడా స్వదేశానికి చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. నిజానికి, మన మువ్వన్నెల జెండా భారతీయులతో పాటుగా ఇతర దేశాల వారిని కూడా సురక్షితంగా సరిహద్దులకు చేరుస్తోంది. అది మనందరికీ గర్వ కారణం, సరే, అయినా విమర్శలు చేసేవారు చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం.
 
తాజాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ ఎన్వీ రమణ, ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపధ్యంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేచేశారు. ఉక్రెయిన్లో చిక్కుకు పోయిన భారతీయ విధ్యార్ధులను స్వదేశానికి రప్పించడంపై కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా భారతీయులను తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని తనను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఆశ్చర్యానికి గురిచేశాయని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

ఈ విషయంలో కోర్టు ఏం చేయగలదు? యుద్ధం ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్’ను నేను ఆదేశించగలనా? అంటూ జస్టిస్ రమణ కొంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే,  సోషల్ మీడియాలో కొందరు సీజేఐ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారని, అంటూ రాజ్యంగ వ్యవస్థలు అధికార పరిధిని దాటి పని చేయలేవని సూచన ప్రాయంగా పేర్కొన్నారు.  

అయితే, పిటిషనర్ విద్యార్థుల తరలింపుపై కేంద్రానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. అందులో ఎక్కువమంది అమ్మాయి లున్నారని అన్నారు. అయితే, ప్రధాన, “ న్యాయమూర్తి విద్యార్ధుల పట్ల మాకు జాలి ఉంది.. కానీ కోర్టు ఏం చేయగలదు? విద్యార్థుల కోసం ప్రభుత్వం ఇప్పటికే చేయగలిగింది చేస్తోంది.. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలో అటార్నీ జనరల్ను అడుగుతాం.. ఈ పిటిషన్ను విచారణకు చేపడతాం.. విచారణ మొదలయ్యే వరకు వేచి ఉండండి’’ అని ఆ న్యాయవాదికి సీజేఐ సూచించారు.