మసాజ్ సెంటర్ బై సివిల్స్ ర్యాంకర్

 

నువ్వు ఏం చేయాలనుకుంటున్నావ్? అనడిగితే.. ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేయాలనుకుంటున్న అనడం వింటుంటాం.. కానీ అతనికి ఐఏఎస్, ఐపీఎస్ అయ్యే టాలెంట్ ఉన్నా, తప్పు చేసి జైలుకెళ్లాడు.. అతని పేరు సంతోష్.. ఊరు వైజాగ్.. ఎమ్మెస్సీ చదివాడు.. సివిల్స్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఇతను, ఫ్రెండ్ తో కలిసి ఓ సెలూన్ నడిపాడు.. ఫ్రెండ్ తో మనస్పర్థలు వచ్చి అతని భార్యపై దాడి చేసి జైలుకెళ్లాడు.. తరువాత మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు పూర్తి చేశాడు..

కానీ ఆ దాడి కేసు కారణంగా సంతోష్ ని విత్ హెల్డ్ లో పెట్టారు.. వేరే ఎవరైనా ఐతే, ఆ కేసు మాఫీ చేయించుకొని ఉద్యోగంలో చేరే అవకాశాల కోసం చూస్తారు.. కానీ అందరిలా చేస్తే సంతోష్ ఎందుకవుతా అనుకున్నాడేమో, పెడదారి పట్టాడు మళ్ళీ జైలుకెళ్లాడు.. ఇంతకీ అతనేం చేసాడో తెల్సా? సెలూన్ ని మసాజ్ సెంటర్ గా మార్చాడు.. మగవారితో ఆడవారికి, ఆడవారితో మగవారికి మసాజ్ చేపిస్తూ చట్ట విరుద్దంగా మసాజ్ సెంటర్ నడుపుతున్నాడు.. ఇతని నిర్వాకం పోలీసులకి తెలిసి అరెస్ట్ చేసారు.. ఇలాంటివి చూసైనా యువత ప్రతిభతో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలని తెలుసుకోవాలి.