TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నటి కవిత కూతురి ప్రేమ వివాహం

Published on: Fri Mar 15, 2013 7:34AM

 

పాతతరం కథానాయిక, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నాయకురాలు కవిత కూతురు మాధురి దళిత నేతల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకుంది. కవిత కూతురు మాధురి, సికింద్రాబాద్ లో ప్రైవేటు కారు డ్రైవర్ గా పనిచేస్తున్న అల్కపల్లి రాజ్ కుమార్ గత రెండేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పడంతో రెండు రోజుల క్రితం ఇంట్లో నుండి వెళ్ళిపోయినా మాధురి రాజ్ కుమార్ ను వివాహం చేసుకుంది. మాధురి బంధువులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు రాజ్ కుమార్ పై కేసు ఫైలు చేసి, పెద్దపల్లికి వెళ్ళి రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.