TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కన్నడ కవి మార్కండపురం శ్రీనివాసుకు "డా. సినారె సాహితీ పురస్కారం"

Published on: Sat Jan 21, 2012 3:46PM

హైదరాబాద్: ప్రతిష్టాత్మక డా. సినారె పురస్కారం - 2011ను ప్రఖ్యాత కన్నడ కవి, “కవిరత్న" మార్కండపురం శ్రీనివాసుకు అందిస్తున్నట్లు సినారె కళాపీఠం అధ్యక్షులు ప్రొ. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పత్రికా ప్రకటనలో తెలిపారు. గత 16 సంవత్సరాలుగా ఈ అవార్డును సాహితీ రంగంలో విశిష్ట కృషి చేసిన వారికి అందజేస్తున్నట్లు తెలిపారు.

అవార్డులో భాగంగా అవార్డు గ్రహీతకు రూ: 25,000 నగదు, ప్రశంసా పత్రంను 24 జనవరి, 2012, సాయంత్రం 6 గంటలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఎన్.టి.ఆర్ ఆడిటోరియం ప్రాంగణంలో అందజేయబడుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖామాత్యులు శ్రీ కొలుసు పార్ధసారధి, జస్టిస్ టి. గోపాలకృష్ణ మూర్తి గారు, డా. సి. నారాయణరెడ్డి గారు, డా. ఎన్. గోపీలు అతిథులుగా విచ్చేయనున్నట్లు కళాపీఠం కార్యదర్శి డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు.

మరిన్ని వివరముల కొరకు సంప్రదించండి...

 

cinarey sahithi puraskaram presentation, cinarey sahiti puraskaram 2011, cinarey sahithi puraskaram presentation ceremony, cinarey sahithi award 2011 function, dr c narayana reddy award 2011, cinarey award ntr auditorium public gardens, ghazal srinivas cinarey award 2011