పాశమైలారం మృతుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సిగాచీ పరిశ్రమ
Published on: Wed Jul 2, 2025 4:01PM

పాశమైలారం కెమికల్ ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడులో 40 మంది మరణించినట్లు సిగాచీ అధికారికంగా ప్రకటించింది. ఈ దుర్ఘటనలో 33 మంది గాయపడినట్లు ధృవీకరించింది. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది.
అలాగే క్షతగాత్రులకు పూర్తి వైద్య సహాయం అందిస్తామనీ, అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొంది. ఈ మేరకు సిగాచీ తరఫున ఆ కంపెనీ కార్యదర్శి వివేక్ కుమార్ ఓ ప్రకటక విడుదల చేశారు. ఈ ప్రమాదంపై స్టాక్‌మార్కెట్‌కు కూడా సమాచారం ఇచ్చిన ఆయన మూడు నెలల పాటు కంపెనీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.


