Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నగ్న వివాహాలకు నో పర్మిషన్
posted on: Jan 20, 2015 11:00AM

పుర్రెకోబుద్ధి అనే మాట అందరికీ తెలిసిందే. బ్రిటన్‌లో కొంతమంది యువతరం పుర్రెలకి ఓ విచిత్రమైన బుద్ధి పుట్టింది. కొన్ని జంటలు ఎంచక్కా పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాయి. అయితే ఆ పెళ్ళి మామూలుగా కాకుండా వెరైటీగా వుండాలని భావిస్తున్నాయి. ఇంతకీ ఆ వెరైటీ ఏమిటంటే, వధూవరులిద్దరూ పెళ్ళి చేసుకునే సమయంలో బట్టలు వేసుకోరు అదన్నమాట. ఈ తరహా వివాహాలు చేసుకోవాలని కోరుకుంటున్న వారి సంఖ్య ఈమధ్యకాలంలో యు.కె.లో విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటికే ఇలాంటి పెళ్ళిళ్ళు చాలామంది చేసేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఇలాంటి వివాహాలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. కాకపోతే ఈమధ్యకాలంలో బ్రిటన్లో ఓ పుకారు షికారు చేసింది. ఇలాంటి నగ్న వివాహాలకు కోర్టు అనుమతి ఇచ్చిందని, ఇక కుర్ర జంటలు ఎంచక్కా బట్టలు విప్పేసి పెళ్ళిళ్ళు చేసుకోవచ్చనేది ఆ పుకారు సారాంశం. దాంతో చాలామంది ఈ టైపు పెళ్ళిళ్ళకి రెడీ అయిపోయారు. దాంతో బ్రిటన్ న్యాయశాఖాధికారి రంగంలోకి దిగి ఇలాంటి పెళ్ళిళ్ళకి ప్రభుత్వం గానీ, కోర్టులుగానీ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. దాంతో చాలామంది యువతీ యువకులు నిరాశకు గురయ్యారు.






