గేల్‌పై ప్రితీ

ఐపీఎల్ 11వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం సందర్భంగా అందరి చూపు వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్‌గేల్‌ పైనే.. బౌలర్ ఎవరైనా చుక్కలు చూపించే అతను మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగల సత్తా ఉన్న ఆటగాడు. అలాంటి వ్యక్తిని వేలం ప్రారంభమైన రెండు రోజుల వరకు పట్టించుకును నాధుడే లేడు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత కూడా ఎవరు పెద్దగా ఆసక్తి చూపించకపోయే సరికి ఈ సీజన్‌లో గేల్ కనిపించడం కష్టమేనని అంతా భావించారు. అయితే ఈ టీ20 స్పెషలిస్టును కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతిజింతా కరుణించింది. మూడోసారి వేలంలోకి వచ్చిన అతడిని కనీస ధర రూ.2 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. అయితే న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు గప్టిల్‌కు మూడోసారి కూడా నిరాశే ఎదురయ్యింది. అతడిని ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా సొంతం చేసుకునేందుకు ముందుకు రాలేదు.