TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిత్తూరు జిల్లాలో రూ. 100 కోట్లకుపైగా మున్సిపల్ స్థలాల కబ్జా

Published on: Mon Feb 20, 2012 1:39PM

చిత్తూరు: చిత్తూరుజిల్లాలోని తిరుపతి కార్పొరేషన్, మరో ఏడు మున్సిపాల్టీల్లో అధికారం, పలుకుబడి ఉన్నవారు మున్సిపల్ స్థలాలను ఆక్రమించుకొని భవంతులు, దుకాణాలు నిర్మించారు. ఈ ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ళ మత్తులో జోగుతోంది. ఫలితంగా కొన్ని చోట్ల డ్రైనేజి కాలువలు కూడా అదృశ్యమయ్యాయి. మరికొన్ని చోట్ల 20 అడుగుల వెడల్పుకు గాను మూడు అడుగులకు కుచించుకుపోయాయి. రోడ్ల వెడల్పు 40 అడుగులకు గాను 15 అడుగులకు తగ్గాయి. జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల్లో ఆక్రమణల పాలైన ప్రభుత్వ స్థలాల విలువ బహిరంగ మార్కెట్ ప్రకారం రూ.100 కోట్లకు పైగా ఉంటుందని ఒక అంచనా.

తిరుపతి కార్పోరేషన్ తో పాటుచిత్తూరు, పలమనేరు, మదనపల్లె, నగరి, పుత్తూరు, శ్రీకాళహస్తి, పుంగనూరు మున్సిపాల్టీల్లో ఈ ఆక్రమణలు జరిగాయి. వీటిపై ఇటీవల ఒక ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు కావడంతో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆక్రమణల తొలగింపుపై తప్పనిసరిగా దృష్టిసారించాల్సిన పరిస్థితి ఏర్పడింది.