కేసీఆర్ కు చంద్రబాబు ధీటైన రెస్పాన్స్
Published on: Fri Feb 10, 2012 10:24AM
చిత్
తూరు: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ను రెచ్చిపోయి మాట్లాడవద్దని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయిడు హెచ్చరించారు. తనపై విమర్శలు చేసినందుకు ఆయన ఈ విధంగా రెస్పాన్స్ ఇచ్చారు. కెసిఆర్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆయన తన ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. ఆయన అసహనంతో మాట్లాడుతున్నారని, హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలన్నారు. తమ నాయకులూ అలా మాట్లాడగలరన్నారు. కాంగ్రెసు పార్టీ దోపిడీ దొంగల పార్టీ అని విమర్శించారు. లిక్కర్ సిండికేట్లకు సంబంధించిన ఎసిబి రిపోర్టును బహిర్గతం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని విడిచి పెట్టేది లేదన్నారు. కొన్ని జిల్లాల్లోనే ఎసిబి దాడులు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో యువతరంగం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. బాబుకు అభిమానులు, టిడిపి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున యువత తరలివచ్చారు. పోలవరం టెండర్లపై న్యాయవిచారణే కాదు, అంతకన్నా ఉన్నతమైన విచారణకైనా తాను సిద్ధంగానే ఉన్నానని ఆయన అన్నారు.


