TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉద్యోగుల జీతాలు ఆపేయండి.. చిత్తూరు కలెక్టర్ సంచలనం 

Published on: Wed May 19, 2021 10:21AM

చిత్తూరు జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  విపత్తు నిర్వహణ చట్టం కింద 5 మండలాల ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెదమండ్యం, తవణంపల్లె, శ్రీకాళహస్తి, సత్యవేడు, మదనపల్లె మండలాల్లోని రెవెన్యూ, పంచాయతీరాజ్‌, హెల్త్‌, సచివాలయం, మున్సిపల్‌ శాఖల ఉద్యోగుల నెల జీతాలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. జీతాలు నిలిపివేయాలని జిల్లా ట్రెజరీని ఆదేశించారు.

ఆరో విడత ఫీవర్‌ సర్వేలో ఆయా మండలాల్లో అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను బేఖాతరు చేసిన వారిపైనా ఇదే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటానంటూ కలెక్టర్ హరినారాయణ హెచ్చరించారు.  ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. చిత్తూరు జిల్లాలో కొంతమంది ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యం వహించారని కలెక్టర్ హరినారాయణ్ సీరియస్ అయ్యారు.. ఉద్యోగులకు జీతాలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ నిర్ణయంపై ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జనాల్లో మాత్రం భిన్న స్పందనలు వస్తున్నాయి. కలెక్టర్ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తున్నారు.