TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిత్తూరు జిల్లాలో ముఖ్యనేత సోదరుడి హల్ చల్

Published on: Sat Feb 25, 2012 2:58PM

ఆయన సంతకం అంటే అధికారులకు హడల్
చితూరు జిల్లా: ఆయన ఒక 'ముఖ్యనేతకు సోదరుడు. చిత్తూరుజిల్లాలో చక్రం తిప్పుతున్నారు. ఆయన చెప్పిందే వేదం. అనేక  సిఫార్సులపై ఆయనే సంతకాలు పెడుతూ అధికారులకు పంపుతున్నారు. ఆయన సంతకంతో వచ్చిన సిఫార్సులేఖను చూసి జిల్లా అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. 'గౌరవనీయులైన ముఖ్యనేత గారికి నమస్కరించి వ్రాసుకున్న అర్జి, మా గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని ప్రార్దిస్తున్నాం' అంటూ సమస్యలు ఇతరత్రా విషయాలపై వినతులు ఈ ముఖ్యనేత సోదరుడి వద్దకు అసంఖ్యాకంగా చేరుతున్నవి. వాటిపై ఆయన సంతకం చేసి జిల్లా ఉన్నతాధికారులకు రిఫర్ చేస్తున్నారు. ఆయన ఏ స్థాయి నాయకుడు కాదు.  ప్రజాప్రతినిధి కూడా కాదు. అయినా ఆయన సంతకంతో సిఫార్సు లేఖ వస్తుండటంతో ఏం చేయాలో తెలీక అధికారులు సతమతమవుతున్నారు. కొంతమంది అధికారులు ఈ లేఖల భాగోతాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ ముఖ్యనేత సోదరుడినుంచి వచ్చిన సిఫార్సు లేఖ అయితే కళ్ళు మూసుకుని పనిచేసి పంపేయ్. లేదంటే నీ ఉద్యోగం ఊడుతుంది జాగ్రత్త అంటూ సలహా ఇస్తున్నారు. కొందరు అధికారులు ఈ లేఖలకు భయపడి పనులు చేస్తుండగా మరి కొందఱు నిబంధనలు అతిక్రమిస్తే ఏం జరుగుతుందోనని తలలు పట్టుకుంటున్నారు. ఈ ముఖ్యనేత సోదరుడు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నాడని కొందరు అధికారులు ఆరోపిస్తున్నారు.