చిరు ఆఖరి ప్రయత్నం

 

 

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు ముసాయిదా చివరి దశకు చేరిన నేపథ్యంలో సీమాంధ్ర నేతలు తమ చిట్ట చివరి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. విభజన అనివార్యం అయితే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్న కేంద్ర మంత్రి చిరంజీవి తాజాగా కేంద్ర మంత్రుల బృందంలోని సభ్యులు సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్ లను కలిశారు. హైదరాబాద్ ను శాశ్వత కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేశారు.


హైదరాబాద్ ను యూటీ చేసి ఢిల్లీ తరహా శాసన సభ ఏర్పాటు చేయాలని చిరంజీవి కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని అయితే విభజన అనివార్యం అయిన పక్షంలో హైదరబాద్ యూటీ చేయాలని తాము యూటీని కోరుతున్నామని అన్నారు. ఇది చివరి ప్రయత్నం అని చిరంజీవి చెప్పడం విశేషం. మొదటి నుండి హైదరాబాద్ విషయంలో సీమాంధ్ర నేతలు పట్టుబడుతున్నారు. అయినప్పటికి కేంద్రం ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు.