TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాలుజారిన చిరు

Published on: Mon Oct 28, 2013 8:59PM

 

వరద ప్రాంతాల్లోని బాధితులను పరామర్శించటానికి వచ్చిన కేంద్ర మంత్రి చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది.. సినిమాల్లో ఎన్ని స్టంట్‌లు అయినా అవలీలగా చేసు మన మెగాస్టార్‌ అదే రేంజ్‌లో పడవ ఎక్కబోయి పాపం కాలు జారిపడిపోయారు..

 

తిమ్మాపురంలో వరద ముంపు ప్రాంతంలో పర్యటిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చిరంజీవితోపాటు మరో ఇద్దరు నేతలు పడవ ఎక్కారు. ముగ్గురూ జారి నీటిలో పడ్డారు. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న సెక్యూరిటి సిబ్బంది చిరును లేపి జాగ్రత్తగా తరలించారు. వరద బాధితులను పరమర్శించడానికి వచ్చిన మంత్రిగారు చివరకు తననే మరొక పరామర్శించే పరిస్థితి కొని తెచ్చుకున్నారంటున్నారు అక్కడి ప్రజలు.