కొత్తపేట ఎమ్మెల్యేకి తీవ్ర అస్వస్థత
Published on: Sun Nov 16, 2014 10:42AM

తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకట రమణ తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న సమయంలోనే తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కూడా తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఆయన ప్రస్తుతం రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా వుందని వైద్యులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుఝామున ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు, భద్రతాసిబ్బంది ఆయనను రాజమండ్రిలోని ఆస్పత్రికి తరలించారు.


