TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైయస్ విజయమ్మపై చిరంజీవి ఫైర్

Published on: Fri Jun 1, 2012 12:29PM

శుక్రవారం తిరుపతి లో చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హత్యపై వేరేవాళ్లు కుట్ర చేశారనడం సరికాదన్నారు. విజయమ్మ స్థాయిని మరిచి రాజకీయాలు చేస్తున్నారన్నారు. వైయస్ విజయమ్మ సానుభూతితో ఓట్లు రాబట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారని, జగన్ పైన కాంగ్రెసు కుట్ర పన్నుతుందన్నది అవాస్తవమన్నారు. రాజకీయ లబ్ధి కోసమే వైయస్ విజయమ్మ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసింది కాంగ్రెసు పార్టీయే అన్నారు. అవి ఏ ఒక్కరివి కావన్నారు. రాజకీయ లబ్ధి కోసం విజయమ్మ ప్రచారం అన్నారు.