తట్టా..బుట్టా సర్దుకున్న 'ముఠామేస్త్రి'

 

 

 

ఆంద్ర రాష్ట్ర విభజన అంశం విషయం ఎటు తేలినా కానీ ఒక్కరు మాత్రం ఏమీ అర్ధం కాని అయోమయ గందరగోళ స్థితిలో పడిపోయారు. ఆ ఒక్కరు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి. పాపం ఆ మహానుభావుడి జాతకం ఏమిటో కాని సామాజికన్యాయం కోసం ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆంద్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకున్నారు,అదికాస్తా బెడిసికొట్టింది. దెబ్బతో 19శాతం ఓటు బ్యాంకుతో అసెంబ్లీలో ఒక మూలాన కూర్చోవలసి వచ్చింది.

 

ఆ తరువాత పార్టీ ని నడపలేక పదవి కోసం, హోదా కోసం అల్లాడిపోతూ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేసి, ఎంచక్కా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేసి రాజ్యసభలో మెంబర్ అయి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి హోదా దక్కించుకొని బతుకుజీవుడా అనుకుంటూ ఉండగా, ఇంతలో ఈ తెలంగాణ విభజన ప్రక్రియ వచ్చి... దెబ్బకు సీమాంధ్ర ప్రజల ఆగ్రహానికి తట్టుకోలేక మంత్రి పదవి వదులుకోవాల్సి వచ్చింది. 



గతంలో శాసనసభలో ప్రభుత్వం పడిపోకుండా ఆపగలిగిన తన ఓటు బ్యా౦క్, ప్రస్తుత పరిస్థితుల్లో తన పదవి వీడిపోకుండా మాత్రం ఆపలేక పోయింది. ఏది ఏమైనా చివరకు పదవి, హోదా అన్నిటిని వదులుకోక తప్పింది కాదు. కనీసం తన పార్టీలో అలాగే కొనసాగినా ఈనాడు ప్రజలలో అతని పట్ల జాలైన ఉండేది. ఆఖరికి 'ముఠామేస్త్రి' కి మిగిలింది తట్టా బుట్టే..!