చిరంజీవికి కేంద్రమంత్రి ఇస్తే ఫలితాలు వేరేల ఉండేవి: లగడపాటి
Published on: Sun Jul 1, 2012 1:25PM
ఎంపీ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చినట్టయితే, ఉప ఎన్నికల ఫలితాలు మరోవిధంగా ఉండేవని చెప్పుకొచ్చారు. వైఎస్ కుమారుడు కదా..పిల్లవాడు కదా..అనే భావనతోనే ఇన్నాళ్లు వైఎస్సార్ సీపీ నేత జగన్ను చూసీ చూడనట్లు వదిలేశామన్నారు. కానీ, నెలరోజులుగా ఆయన పార్టీని తమ నేతలు దీటుగా ఎదుర్కొంటున్నారని, ఈ వైఖరి మరో రెండేళ్లు కొనసాగితే పార్టీ బలోపేతం కావడం ఖాయమని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై వచ్చే ఆగస్టు నాటికి స్పష్టత వస్తుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు. కేంద్ర హోం మంత్రి చిదంబరం వ్యాఖ్యలు కూడా ఇవే సంకేతాలు ఇచ్చినట్టు భావిస్తున్నానన్నారు. 2014 ఎన్నికల్లో సమైక్యవాదమో, తెలంగాణ వాదమో కాక కాంగ్రెస్వాదంతో ముందుకు వెళతామని లగడపాటి వ్యాఖ్యానించారు.


