జగన్ రోజులు లేక్కపెట్టుకోవాలి: చిరంజీవి
Published on: Fri May 25, 2012 4:29PM
అక్రమ ఆస్తుల కేసులో జగన్ ఇక రోజులు లెక్క పెట్టుకోవాలని చిరంజీవి అన్నారు. సిబిఐ విచారణలో మరిన్ని విషయాలు బయటపడి, జగన్ పాపాల పుట్ట పగులుతుందని మండిపడ్డారు. జగన్ అధికార దాహం వల్లే ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. అవినీతి నేతలను తరిమి కొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అల్లర్లపై జగన్ చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికం అన్నారు. జగన్ వ్యాఖ్యలు, ఆయన వర్గం నేతల చూస్తుంటే అల్లర్లను వారే రెచ్చగొడుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల వ్యాఖ్యలు సరికాదన్నారు. మోపిదేవి వెంకటరమణ తన నిజాయితీని నిరూపించుకుంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఏకపక్ష నిర్ణయాల వల్లనే మోపిదేవి సంతకం చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.


