జనసేన పార్టీ చిరంజీవి అభిమానులది.!!

అఖిల భారత చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు స్వామినాయుడితో పాటు పలువురు చిరంజీవి అభిమానులు జనసేనలో చేరారు.. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ ‘జనసేన పార్టీ చిరంజీవి అభిమానులది.. నా ఒక్కడిది కాదు.. ఆయన అభిమానుల్లో నేనూ ఒకడిని.. నాకు ఒక్కరే హీరో.. ఆయనే చిరంజీవి’ అన్నారు.. ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ల మధ్య భిన్నమైన భావనలు, వ్యక్తిత్వాలు, ఆలోనలు ఉండడంలో తప్పు లేదు.. కొందరు వాటిని అర్థం చేసుకోకుండా స్పర్థలని ప్రచారం చేస్తున్నాన్నారు.. సామాజిక, రాజకీయ మార్పు కోసం పుట్టిందే జనసేన అని చెప్పిన పవన్.. జనసేన ఏపీలో మాత్రమే కాదు తెలంగాణాలో కూడా ఉంటుంది.. తెలుగువాళ్లున్న ప్రతి చోటా జనసేన వాళ్లకు అండగా నిలుస్తుంది అని స్పష్టం చేశారు.