చిరంజీవి నా కొడుకులాంటి వాడు: దాసరి
Published on: Sun Dec 23, 2012 2:46PM

దర్శకుడు సురేష్ కృష్ణ రాసిన “భాషాతో నేను” పుస్తకావిష్కరణ దాసరి చేసిన వ్యాఖ్యలు చిత్రరంగంలో పెనుదుమారం రేపాయి. అడ్రస్ లేని వాళ్లకు అడ్రస్ ఇచ్చా అంటూ దర్శకరత్న దాసరి నారాయణ రావు చేసి వ్యాఖ్యలు చిరంజీవి గురించేనన్న టాక్ వచ్చింది. దీనిపై దాసరి నారాయణ రావు వివరణ ఇచ్చారు. చిరంజీవి నాకు కొడుకు లాంటి వాడని, మేము ఎప్పుడు కలిసే ఉంటామని అన్నారు. మీడియా కావాలనే నేనాన్న వ్యాఖ్యలు వక్రీకరించి రాశారని అన్నారు. చిరును ఉద్దేశించి నేను ఆ వ్యాఖ్యలు చేయలేదని, నేను జనరల్ గా జరిగింది చెప్పానని అన్నారు.


