చిరు ఛాలెంజ్.. పవన్ రియాక్షన్
Published on: Wed Aug 1, 2018 11:52AM

ఈ మధ్య సెలబ్రిటీస్ ఒకరికొకరు ఛాలెంజ్ విసురుకుంటున్నారు.. ఛాలెంజ్ అంటే 'పంతం మీదా? మాదా? సై' టైప్ కాదులేండి.. 'నేనొక మంచిపని చేశాను, నువ్వు కూడా చేయ్' అలాంటి ఛాలెంజ్ అనమాట.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 'గ్రీన్ ఛాలెంజ్' ట్రెండ్ నడుస్తుంది.. కేటీఆర్, మహేష్ బాబు, రాజమౌళి ఇలా ఎందరో సెలబ్రిటీస్ మొక్కలు నాటి ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఇతర సెలబ్రిటీస్ కి ఛాలెంజ్ విసురుతున్నారు.. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఛాలెంజ్ ని స్వీకరించారు.. స్వీకరించడమే కాదు మొక్క నాటి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఛాలెంజ్ విసిరారు.. మరి అన్నయ్య ఛాలెంజ్ విసిరితే తమ్ముడు రియాక్ట్ అవ్వకుండా ఉంటాడా?.. వెంటనే ఛాలెంజ్ స్వీకరించారు.. మొక్కలు నాటి ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.. మొత్తానికి ఈ గ్రీన్ ఛాలెంజ్ పుణ్యమా అని సెలబ్రిటీస్ మొక్కలు నాటుతున్నారు.. ఇతర సెలబ్రిటీస్, ఫ్యాన్స్ కూడా మొక్కలు నాటేలా చేస్తున్నారు.
.jpg)


