TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరంజీవికి త్వరలో కేంద్ర మంత్రి పదవి: లగడపాటి

Published on: Sat Jun 30, 2012 2:55PM

నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి త్వరలో కేంద్ర మంత్రి పదవి వస్తుందని లగడపాటి జోస్యం చెప్పారు. ఆయన శనివారం ఉదయం కలియుగ వైకుంఠ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడాతు కాంగ్రెసు 2014లో అధికారంలోకి వస్తుందని, చిరంజీవికి కూడా కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ 60 శాతం ఓట్లతో రాష్ట్రపతి అవుతారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.