చిరంజీవి వర్సెస్ సీఎం కిరణ్

 

chiranjeevi, cm kiran kumar reddy, chiranjeevi congress, kiran kumar reddy chiranjeevi

 

కాంగ్రెసు పార్టీలో ఇప్పుడు బిల్లు పోరు సాగుతోంది! తమ పార్టీకి దూరమవుతున్న ఎస్సీ, ఎస్టీలను దగ్గర చేసుకునేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును సభలో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ఘనత 'తమ'దిగా కాకుండా 'తన'దిగా చెప్పుకునే ప్రయత్నాలు రాష్ట్ర కాంగ్రెసు నేతలు చేస్తున్నారు.


ఈ క్రెడిట్ నాదంటే నాదే అంటూ సీఎం కిరణ్, కేంద్ర మంత్రి చిరంజీవి, మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పోటీ పడుతున్నారు. అసలు క్రెడిట్ సోనియాదేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయ ణ ముక్తాయిస్తున్నారు.  సీఎం కిరణ్.. మాత్రం ఇందిరమ్మ బాటలో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తూ అట్టడుగు వర్గాల కష్టనష్టాలను కళ్లారా చూశానని, ఆ అనుభవం నుంచే ఎస్సీ ఎస్టీ వర్గాలకు కేటాయిస్తున్న నిధులు దారి మళ్లకుండా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని భావించానని చెప్పారు. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టబద్ధతని వివరించారు.



కేంద్ర మంత్రి చిరంజీవి మాట్లాడుతూ.. పీఆర్పీని విలీనం చేసేప్పుడే ఎస్సీ, ఎస్టీ నిధులను వారి కోసమే ఖర్చు చేయాలని.. సోనియాకి సూచించానని దానికి అక్షర రూపమే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత అని స్పష్టం చేశారు. ఇలా ఎవరికి వారు చట్టబద్ధత ప్లాన్ తమదంటే తమదని చెబుతుంటే.. బొత్స సత్యనారాయణ మాత్రం ఇదంతా సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ క్రెడిట్‌గా పేర్కొంటున్నారు.