TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫిబ్రవరిలో చిరంజీవికి కేంద్రపదవి?

Published on: Fri Dec 16, 2011 1:38PM

న్యూఢిల్లీ: చిరంజీవికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో ఆయనను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలని నిర్ణయం జరిగిపోయినట్లు ఎఐసిసి వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్‌లో ఆయనను రాజ్యసభకు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆరు నెలలోగా లోకసభకు గానీ రాజ్యసభకు గానీ ఎన్నిక కావాల్సి ఉంటుంది. దీంతో ఫిబ్రవరిలో చిరంజీవికి మంత్రి పదవి ఇచ్చి, ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎంపిక చేయాలని అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు.