చిరంజీవికి కలిసొచ్చిన కాలం
Published on: Mon Oct 29, 2012 2:07PM
.png)
చిరంజీవికి పర్యాటక రంగం రావడంతో ఉబ్బితబ్చిబ్బవుతున్నారు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఆయన విశాఖ పట్నం లో స్టుడియో ఏర్పాటు చేయబోతున్నరు. ఇంతకు ముందే అక్కడ రామానాయుడు స్టుడియో నిర్మాణం చేసారు. హైదరాబాద్ స్టుడియోలలో తెలంగాణ వాదులు ఎప్పుడు ఉద్యమం చేసి షూటింగులు కాన్సిల్ చేస్తారో అని భయం భయంగా నిర్మాతలు, డైరెక్టర్లతో పాటు సినీ యూనిట్ మొత్తం బెంబేలెత్తుతున్న నేపద్యంలో ఈ స్టుడియో నిర్మాణం ప్రాధాన్యత సంతరించుకొంది. అలాగే చిరంజీవి అనుంగు శిష్యుడైన అనకాపల్లి ఎమ్మేల్యే గంటా శ్రీని వాసరావు కూడా విజవాడలోని భవాని ఐలాండ్ ను అభివద్ది చేసేందుకు తహతహ లాడుతున్నారు. దీంతో కాకినాడలోని బీచ్ తో పాటు మరికొన్ని సముద్రతీరాలలో రిసార్ట్ కట్టించి పర్యాటక రంగాన్ని విస్తరించాలని చూస్తున్నారు. అయితే చిరంజీవి సొంత నిర్మాణాలకే ప్రాధాన్యం ఇస్తారా లేదా ఆంద్రప్రదేశ్ లో పర్యాటకరంగాన్నిసంవత్సరంన్నరలో అభివద్ది చేస్తారా అనేది కాలం జవాబు చెప్పాల్సిందే.


