చిరంజీవి చిన్నబుచ్చుకున్నారు.......
Published on: Thu Jul 5, 2012 12:30PM
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీలో బలంపెంచినా తనకు సముచిత స్థానం దక్కట్లేదని ఆయన వాపోతున్నారని తెలుస్తుంది. తనను, తనతో పాటు కాంగ్రెస్ లో చేరిన క్యాడర్‌ను తక్కువగా చూస్తున్నారని బాధ్యతలు ఏవీ తన క్యాడర్‌కు అప్పగించటం జరగలేనందువల్ల ఆయన మనోవ్యధ చెందుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
రాహుల్‌గాంధీ తనను పిలవకుండా మిగిలిన కాంగ్రెస్ నాయకులను మాత్రమే పిలిపించుకోవడం ఆయనను మరింత కృంగదీసింది. అలాగే సోనియా గాంధీ తన లాగే నటి అయిన హేమమాలిని, ధర్మేంద్ర కూతురు పెళ్లికి రాలేకపోయానని సారీచెబుతూ ఇషాడియోల్, భరత్‌ని డిన్నర్‌కు ఆహ్వానించి తన కొడుకుకోడలైన చరణ్‌ని, ఉపాసనని పిలవక పోవటం కూడా చిరంజీవిని బాధకు గురిచేసింది. అధిష్టానం తనను గుర్తించలేదనటానికి ఇదే నిదర్శనంగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పతనమయ్యే సమయంలో తాను ఎన్నో విమర్శలు ఎదుర్కోని ఆ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశానని అందుకు కాంగ్రెస్ తనకు పెద్దగా చేసిందేమీ లేదన్న భావనతో ఆయన ఉన్నట్లు తెలిసింది.


