డిఎల్ అలా అని ఎందుకు అనుకోవాలి
Published on: Tue Feb 7, 2012 3:09PM
కడ
ప: మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలకు తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వర్గం మంత్రి సి.రామచంద్రయ్య కౌంటర్ వేశారు. మంత్రి వర్గంలోకి ఎవరిని తీసుకోవాలనేది ముఖ్యమంత్రి ఇష్టానుసారమేనని అన్నారు. సమర్థతను బట్టే ఆయన మంత్రులను నియమిస్తారని అన్నారు. పాలనాపరమైన సర్దుబాటు కోసమే డిఎల్ రవీంద్రా రెడ్డి శాఖలో కోత విధించి ఉంటారని అన్నారు. కేవలం తన శాఖలో మాత్రమే కోత అని డిఎల్ ఎందుకు అనుకోవాలని ప్రశ్నించారు. ఉప ఎన్నికల బాధ్యత ఏ ఒక్కరి పైనో ఉండదని, అది జిల్లాకు చెందిన మంత్రుల అందరి బాధ్యత అన్నారు. ప్రాంతాల వారీగా ముఖ్యమంత్రి సమీకరణలు జరుపుతున్నారని, త్వరలోనే సీనియర్లకు మంత్రివర్గంలో అవకాశం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా అంతకుముందు డిఎల్, తాను పని చేయలేదని శాఖలపై కోత కోసి ఉంటే తనకు మంత్రి పదవే అవసరం లేదని మండిపడిన విషయం తెలిసిందే.


