TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరు,బాలయ్యపై సామాన్య కార్యకర్తను పోటీకి నిలబెడతాం

Published on: Wed Jan 25, 2012 8:59AM

హైదరాబాద్: చిరుపై తాను పోటీ చేస్తానని బాలకృష్ణ ప్రకటిస్తే.. వాళ్లిద్దరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సామాన్య కార్యకర్తను పోటీకి నిలబెడతామని అంబటి రాంబాబు ప్రకటించారు. చిరంజీవి, బాలకృష్ణలిద్దరూ ముఖాముఖి తలపడితే తమ పార్టీ తరపున సామాన్య కార్యకర్తను అభ్యర్థిగా నిలిపి వాళ్లిద్దర్నీ తుక్కుతుక్కుగా ఓడిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీల అభ్యర్థుల సీట్లు గల్లంతవుతాయని జోస్యం చెప్పారు. ఇక జగన్ పై సీబీఐ విచారణ ఉద్దేశ్యపూర్వకంగా జరుగుతుందని ఆరోపించారు. దేశంలో ఎన్నో పెండింగ్ కేసులున్నప్పటికీ ప్రత్యేకంగా జగన్ కేసుపైనే దృష్టి కేంద్రీకరించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.