చిరంజీవికి బిఇడి విద్యార్థుల నిరసనలు
Published on: Mon Jan 23, 2012 1:40PM
తిరుప
తి: స్థానిక శాసనసభ్యుడు చిరంజీవిని బిఇడి విద్యార్థులు సోమవారం అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. జివో నెంబర్ 3ను తొలగింప చేయాలని విజ్ఞప్తి చేశారు. చిరంజీవిని అడ్డుకున్న బిఇడి విద్యార్థులకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు పలికింది. చిరంజీవి నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉదయం తిరుపతి వచ్చారు. అంతకుముందు హైదరాబాద్ నుండి తిరుపతి విమానాశ్రయంలో దిగిన ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవులు మూడు ఇవ్వలేమని చెప్పి అధిష్టానం సర్దుకోమని చెప్పిందని, తెలంగాణకు మరో విధంగా న్యాయం చేస్తామని చెప్పిందని అందువల్లే రెండు మంత్రి పదవులు ఒప్పుకున్నట్లు చెప్పారు. హీరో నందమూరి బాలకృష్ణ తనపై పోటీ చేస్తారనే అంశంపై స్పందిస్తూ ఆయన అన్న వ్యాఖ్యల్లో తప్పేమిటన్నారు.


