TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఊహాగానాలకు తెర..పీఆర్పీ నేతలకు శాఖల కేటాయింపు

Published on: Fri Jan 20, 2012 11:16AM

హైదరాబాద్: చిరంజీవి వర్గానికి చెందిన కొత్త మంత్రులు సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావులకు  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం శాఖలను కేటాయించారు. రామచంద్రయ్యకు దేవాదాయ, గంటాకు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఓడరేవులు శాఖలను కేటాయించారు. దీంతో తొలిసారి మంత్రివర్గంలో అవకాశం లభించిన పీఆర్పీ నేతలకు ఏ శాఖలు కేటాయిస్తారోనన్న ఊహాగానాలకు తెరపడింది. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో రామచంద్రయ్య, గంటాలు భేటీ అయ్యారు. వారు విద్యుత్, వాణిజ్య శాఖలకు పట్టుబడినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఉదయం సిఎంతో భేటీ ఐన తర్వాత తీవ్ర తర్జనభర్జన అనంతరం సిఎం కేటాయించిన శాఖలకు వారు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. వీరిలో రామచంద్రయ్య టిడిపి హయాంలో మంత్రిగా చేశారు. గంటా శ్రీనివాస రావు మంత్రి బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి.