TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరు కోరిక మీదే పదవులు..19నముహూర్తం ఖరారు

Published on: Tue Jan 10, 2012 9:35AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోకి చిరంజీవి వర్గాన్ని చేర్చుకోవడానికి ఎట్టకేలకు ముహూర్తం  కుదిరింది. ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే విషయాన్నే కాకుండా ముహూర్తాన్ని కూడా చిరంజీవికి వదిలేశారు.దీంతో ఈ నెల 19వ తేదీని ఆయన ఖరారు చేయడంతో కాంగ్రెసు అధిష్టానం అందుకు అంగీకరించినట్లు సమాచారం. తొలుత ఈ నెల 17వ తేదీ అనుకున్నా, ఆ ముహూర్తం కుదరలేదని అంటున్నారు. దీంతో ఈ నెల 19వ తేదీన చిరంజీవి వర్గానికి చెందినవారికి మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ముందు అనుకున్న ప్రకారమే శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావు, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యలకు మంత్రి పదవులు దక్కనున్నాయి. రామచంద్రయ్యను కడప జిల్లాకు చెందిన కాంగ్రెసు నాయకులు వ్యతిరేకించినప్పటికీ చిరంజీవి అభిప్రాయానికే ప్రాధాన్యం ఇచ్చారు. ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వాలని చిరంజీవి కోరగా, ప్రస్తుతం ఇద్దరితో సరిపెట్టుకోవాలని కాంగ్రెసు అధిష్టానం సూచించింది. దానికి చిరంజీవి అంగీకరించారు.