చిరును అడ్డంపెట్టుకుంటున్న బొత్స : అంబటి
Published on: Fri Dec 23, 2011 2:53PM
హైదరాబాద్:
చిరంజీవి ఆల్ ఇండియా అమాయకుడు అని, ఆయనను అడ్డం పెట్టుకొని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సిఎం సీటును పొందాలని అనుకుంటున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు.రైతు సమస్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పిలుపు మేరకు అయన గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా అమాయకుడు చిరు అన్నారు.తనకు రావాల్సిన ముడుపులు మధ్యవర్తులకు అందుతున్నాయన్న అక్కసుతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిండికేట్లపై ఎసిబి దాడులు చేయించారని విమర్శించారు. ఈ సందర్భంగా రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆందోళన కార్యాక్రమాలలో ఆయా ప్రాంతాలలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.


