TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరు విజయం .. ముగ్గురికి పదవులు!

Published on: Wed Dec 21, 2011 7:57AM

న్యూఢిల్లీ: కాంగ్రెసు అధిష్టానం వద్ద ప్రజారాజ్యం శాసనసభా పక్ష నేత చిరంజీవి తన పంతం నెగ్గించుకున్నారు. తన వర్గం శాసనసభ్యులకు మంత్రి పదవులు ఇప్పించుకోవడంలో విజయం సాధించినట్లు తెలుస్తోంది. ఒక్కో ప్రాంతానికి ఒక్కరు చొప్పున ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు మంత్రి పదవులు ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. ఇందుకు కాంగ్రెసు అధిష్టానం అంగీకరించినట్లు సమాచారం. దీనిపై కాంగ్రెసు అధిష్టానంతో చర్చలు జరిపేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణకు కూడా ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేవలం ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు మంత్రి పదవులు కల్పించడానికే ఈ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. కోస్తా నుంచి గంటా శ్రీనివాస రావుకు, రాయలసీమ నుంచి సి. రామచంద్రయ్యకు, తెలంగాణ నుంచి అనిల్‌కు మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.