TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిన్నం రాయకోటయ్యకు అభయ ‘‘ హస్తం ‘‘

Published on: Tue Jul 17, 2012 12:44PM

నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య చివరికి కాంగ్రెస్‌లో కుదురుకున్నారా? అన్న సందేహం ఆయన కాంగ్రెస్‌ నాయకుడు పాలడుగువెంకట్రావు పత్రికావిలేకరుల సమావేశంతో బలపడుతోంది. నిన్నటి వరకూ వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ తో మొదలుపెట్టిన ఈ ఎమ్మెల్యే చివరకు కాంగ్రెస్‌లోనే చేరేశానన్నట్లు వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ టిక్కెట్టుపై ఎమ్మెల్యే అయిన చిన్నం ఇప్పుడు పాలడుగు వెనుక తిరుగుతున్నారు. పాలడుగు ఎక్కడికి వెడితే అక్కడికి ఆయన కూడా వచ్చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ నాయకులను పలకరిస్తూ తాను ఆ పార్టీ వాడినే అనేలా వ్యవహరిస్తున్నారు. పాలడుగు పాత్రికేయులతో మాట్లాడుతూ ఉండగా చిన్నం తాను రాష్ట్రపతి యుపిఎ అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీకి మద్దతు ఇస్తున్నానని తేల్చిచెప్పారు. అంతేకాకుండా తనకు రాష్ట్రపతిగా గెలిచిన తరువాత ప్రణబ్‌తో ఫొటో తీయించుకోవాలనుందని అన్నారు.

 

దీనికి పాలడుగు వెంటనే స్పందిస్తూ ప్రణబ్‌ ముఖర్జీతో తాను రచించిన పుస్తకాలు ఆవిష్కరణ జరుగుతుందని ఆ సమయంలోనే చిన్నం ఆయనతో ఫొటో తీయించుకోవచ్చని హామీ ఇచ్చారు. ఇంతకీ కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ మరో ఎమ్మెల్యేను వదులుకున్నట్లేనా? చిన్నం రాష్ట్రపతి ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తారా? మరి నాని విషయంలో తెలుగుదేశం పార్టీ చేసినంత అల్లరి మళ్లీ రామకోటయ్య విషయంలో తప్పదా? అన్న పలు ఆసక్తికరమైన సందేహాలు పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతల స్పందన ద్వారానే ఈ సందేహాలు తీరుతాయని వారు ఎదురుచూస్తున్నారు.