అమెరికాకు చైనా మరో వార్నింగ్... వార్ తప్పదు...
Published on: Mon Mar 13, 2017 1:07PM

అమెరికా, చైనా దేశాల మధ్య గత కొద్ది రోజులుగా కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చైనా పలుమార్లు అమెరికాకు పలు విషయాల్లో వార్నింగులు ఇవ్వగా.. ఇప్పుడు మరోసారి తాజాగా ట్యాక్స్ విషయంలో అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. ఇటీవలే చైనా ఉత్పత్తులపై 45 శాతం ట్యాక్స్ విధించాలని ట్రంప్ భావిస్తూ.. డబ్ల్యూటీవో నిర్ణయాలను పక్కనబెట్టి కొత్త వార్షిక ట్రేడ్ పాలసీ ఎజెండాలను కాంగ్రెస్ కు పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా ఈ వ్యాఖ్యలు చేసింది. డబ్ల్యూటీవో నిబంధనలను పట్టించుకోకుండా తమ ఉత్పత్తులపై ట్యాక్స్‌లు విధిస్తే ఆ దేశంతో ట్రేడ్ వార్‌కు దిగుతామని.. 1930 లో తలెత్తిన ట్రేడ్ వార్ మరోసారి కనపడుతుందని హెచ్చరించింది. అటువంటి విధానాలు అర్థవంతం కావని హితవు పలికింది. మరి చైనా వార్నింగ్ ను ట్రంప్ సీరియస్ గా తీసుకుంటారా...?లేక తన పని తాను చేసుకుంటూ పోతారా? లేదా? అన్నది చూడాలి.


