చెరువులో పడిన స్కూలు వ్యాను: 11 మంది మృతి
Published on: Fri Jul 11, 2014 8:22AM

స్కూలు వ్యాను చెరువులో పడి ఎనిమిది మంది చిన్నపిల్లలతోపాటు ముగ్గురు స్కూలు సిబ్బంది మరణించారు. ఈ ఘోరం చైనాలో జరిగింది. సెంట్రల్ చైనాలో విద్యార్థులను స్కూలు నుంచి ఇళ్ళకు తీసుకెళ్తున్న స్కూలు వ్యాను అదుపుతప్పి చెరువులో పడిపోయింది. ఈ ప్రమాదంలో కిండర్గార్డెన్ విద్యార్థులు 8 మంది, స్కూలు సిబ్బంది ముగ్గురు నీటిలో మునిగి చనిపోయారు. ఈ వ్యానులో 11 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో అందరూ చనిపోయారు.


