TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

బతికించిన కొవ్వు...

Published on: Fri Mar 10, 2017 2:27PM

 

సాధారణంగా మనిషి శరీరంలో కొవ్వు ఎక్కువైతే చాలా హానికరం.. చాలా రకాల జబ్బులు వస్తాయి అంటుంటారు. కానీ ఆ కొవ్వే ఇప్పుడు ఏ మనిషి ప్రాణాలు కాపాడింది అంటే వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. అది మాత్రం పచ్చి నిజం. ఇంతకీ కొవ్వేంటి.. బతికించడమేంది అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే...చైనాలోని గువాంగ్‌డంగ్‌ ప్రావిన్స్‌లో ఓ మహిళ జోంగషాన్‌ నదిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు దూకింది. అయితే దూకిన వెంటనే ఆమె నీళ్లలో మునిగిపోకుండా తేలి ఆడుతూ చాలా సేపు నీటిపైనే ఉంది. ఇక ఆమెను గమనించిన కొంతమంది పోలీసులకు సమాచారం అందిచడంతే.. పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను కాపాడారు. కొంత భారీకాయంతో ఉన్న ఆమెను పైకి లేపడానికి పోలీసులు చాలాసేపు ఇబ్బంది పడినా.. పైకి తీసుకురాగలిగారు. అనంతరం బయటకు వచ్చిన ఆమెను వైద్యులు పరీక్షించి చూడగా.. అసలు నిజం బయటపడింది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు పదార్థాలే నీటిలో మునిగిపోకుండా తేలియాడేలా చేశాయని వైద్యులు చెప్పడంతో అక్కడ ఉన్న పోలీసులతో పాటు ఆ మహిళ కూడా ఒకింత షాకింగ్ కు గురయ్యారు. మొత్తానికి కొవ్వు వల్ల ప్రాణాలు పోవడమే కాదు.. నిలుస్తాయని కూడా రుజువైంది.