చైనాలో భారీ పేలుడు...


చైనాలో భారీ పేలుడు సంభవించింది. చైనాలోని ఫుగూ ప్రాంతంలో నిన్న రాత్రి భారీ పేలుడు సంభవించగా.. 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా..147 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫుగూలోని జిన్ మిన్ ప్రాంతంలోని ఓ నివాస గృహంలో ఈ పేలుడు సంభవించగా.. ఈ పేలుడు ధాటికి అక్కడ ఉన్న ఇతర గృహాలు, ఓ ఆసుపత్రి ధ్వంసమయ్యాయి. వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. పేలుడు ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పేలుడుకు గల కారణాలు ఇంతవరకు తెలియరాలేదు.