చైనాలో భారీ వరదలు... 19 మంది మృతి
Published on: Mon Sep 15, 2014 11:21AM
.jpg)
మన దేశంలోని కాశ్మీర్లో భారత వర్షాల కారణంగా వరదలు ఆ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. వరద పరిస్థితి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో చైనాలో కూడా భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా చైనాని కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా చైనాలో ఇప్పటి వరకు 19 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ వుండే అవకాశం వుందని అధికార వర్గాలు అంటున్నాయి. ఇప్పటి వరకు 20 మంది గల్లంతయ్యారని తెలుస్తోంది. వరదల్లో చిక్కుకున్న వేలాదిమంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చోంగ్‌కింగ్ నగరంలో 12 మంది, సిచువాన్ ప్రావిన్స్‌లో ముగ్గురు, షాంగ్జిలో నలుగురు మరణించారు.


