TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

చైనా వ్యాక్సిన్లు ఢమాల్.. అమెరికా టీకాకు డిమాండ్! 

Published on: Wed Jun 23, 2021 10:48AM

చైనా మాల్ అంటే సెకండ్ గ్రేడ్ అని టాక్. చైనాలో ఉత్పత్తి అయిన వస్తువులన్ని నాశిరకంగా ఉంటాయనే విమర్శ ఉంది. అందుకే వాటి ధర కూడా తక్కువగానే ఉంటుందని చెబుతారు.  నాశిరకం ఉత్పత్తులను తయారుచెయ్యడంలో నంబర్ వన్ అయిన చైనా... చివరకు కరోనా వ్యాక్సిన్లను కూడా అలాంటివే చేసినట్లు పరిస్థితి కనిపిస్తోంది. కరోనా వ్యాక్సిన్ ఏదైనా సరే... దాన్ని వేసుకున్న తర్వాత కూడా కరోనా సోకే అవకాశాలు 100 శాతం ఉంటాయి. అయితే  వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తికి కరోనా సోకినా... ఆ వ్యక్తి నుంచి అది ఇతరులకు సోకే అవకాశాలు చాలా తక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు.  అలా చెయ్యకపోతే... ఆ వ్యాక్సిన్ పనిచేయనట్టే. చైనా కొవిడ్ టీకా విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది.  చాలా దేశాలు హడావుడిగా. చైనా వ్యాక్సిన్ డోసులు కొనేసి... తమ ప్రజలకు వేసేశాయి. ఇప్పుడా దేశాల్లో కరోనా మళ్లీ పెరుగుతోంది. ఇందుకు కారణం చైనా వ్యాక్సిన్లు పనిచెయ్యకపోవడం వల్లేనని తెలిసింది. 

చైనాను జిత్తుల మారి దేశంగా పిలుస్తుంటారు. గిమ్మిక్కులు చేయడంలో అది టాప్. కరోనా మహ్మమారి పుట్టింది కూడా చైనాలోనేననే ఆరోపణలు మొదటి నుంచి ఉండనే ఉన్నాయి. చైనాలో కొవిడ్ కంట్రోల్ కూడా త్వరగానే అయింది. తమ వ్యాక్సిన్ల వల్లే దేశంలో కరోనా కంట్రోల్ అయ్యిందని ప్రచారం చేసుకుంది డ్రాగన్. చైనా నుంచి వచ్చిన సినోఫార్మ్ (Sinopharm), సినోవాక్ బయోటెక్ (Sinovac Biotech) వ్యాక్సిన్లు వచ్చాయి. వీటిని అమ్మి  తెలివిగా సొమ్ము చేసుకుంది చైనా. చాలా దేశాలు చైనాను గుడ్డిగా నమ్మి... పెద్ద ఎత్తున వ్యాక్సిన్ల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. చైనా నుంచి  కొనుగోలు చేసిన వ్యాక్సిన్ తమ ప్రజలకు అందించాయి. అయితే ఆ వ్యాక్సిన్లు సరిగా పని చేయడం లేదని తెలుస్తోంది. 

చిలీ, బహ్రైన్, మంగోలియా లాంటి దేశాలు 50 నుంచి 68 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్ వేశాయి. కొన్ని దేశాలు అమెరికా కంటే ముందు ఉన్నాయి. ప్రపంచంలో కరోనాను ఎక్కువగా ఎదుర్కొన్న టాప్ 10 దేశాల్లో నాలుగు దేశాలు చైనా నుంచి వచ్చిన సినోఫార్మ్ , సినోవాక్ బయోటెక్ వ్యాక్సిన్లను వాడాయి. ప్రస్తుతం ఆ  దేశాల్లో కరోనా మళ్లీ పెరుగుతోంది.  ఇజ్రాయెల్ లాంటి దేశాలు మాత్రం అమెరికాకు చెందిన ఫైజర్ (Pfizer) వ్యాక్సిన్ వాడాయి.  ఇజ్రాయెల్‌లో కరోనా బాగా కంట్రోల్ అయ్యింది. అక్కడ ఇప్పుడు ప్రజలు మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. 

చైనా చాలా దేశాలకు వ్యాక్సిన్లు కావాలంటే మమ్మల్ని అడగండి అంటూ... కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. కానీ ఆ వ్యాక్సిన్లు తమకు వద్దని విదేశాల్లో ప్రజలు అంటున్నారు.  చైనా చేతిలో మోసపోయిన వర్ధమాన అభివృద్ధి చెందుతున్న దేశాలు... ఇప్పుడు రేటు ఎక్కువైనా అమెరికా లాంటి దేశాల వ్యాక్సిన్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో వ్యాక్సిన్ల వ్యాపారం అమెరికాకు బాగా కలిసొచ్చేలా కనిపిస్తోంది. మన దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లు కూడా బాగానే పనిచేస్తున్నా... ఉత్పత్తి అయ్యేవి ఇండియాకే సరిపోని పరిస్థితి ఉంది.