చంద్రబాబుకు చైనా రాయబారి లేఖ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష..
Published on: Wed Jan 19, 2022 11:03AM
చంద్రబాబు గ్లోబల్ లీడర్. ఈ విషయంలో ఎవరికీ అనుమానమే అక్కర్లేదు. బిల్‌గేట్స్ నుంచి బిల్ క్లింటన్ వరకూ.. చాలా మంది అంతర్జాతీయ ప్రముఖులు చంద్రబాబును గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌ను గుర్తుపడతారు. ఏపీ ముఖ్యమంత్రిగా కాలికి బలపం కట్టుకొని.. ప్రపంచ దేశాలు తిరిగి.. రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ.. ఇటీవల నవ్యాంధ్ర కోసమూ.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అలుపెరుగని కృషి చేశారు. తెలుగు రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలిపారు.
అలాంటి చంద్రబాబుకు కరోనా పాజిటివ్ అని తెలిసి.. సొంత రాష్ట్ర ప్రజలే కాదు.. విదేశీ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. తాజాగా, టీడీపీ అధినేత చంద్రబాబుకు భారత్‌లోని చైనా రాయబారి సున్ వెయిడాంగ్ లేఖ రాశారు. చంద్రబాబు కొవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని చైనా రాయబారి ఆకాంక్షించారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ లేఖ రాశారు.
చంద్రబాబు మంగళవారం కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారు.
.webp)


