TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నన్ను బ్రతికించు నాన్నా..కంటతడి పెట్టిస్తున్న చిన్నారి వీడియో..

Published on: Mon May 15, 2017 11:02AM

 

"నాన్నా నన్ను బ్రతికించు నాన్నా.. నాకు బ్రతకాలని ఉంది.. నన్ను బ్రతికించండి..  నా స్నేహితులతో ఆడుకోవాలని, స్కూలుకు వెళ్లాలని ఉంది".. ఓ చిన్నారి తన తండ్రిని ప్రాధేయపడుతూ మాట్లాడిన మాటలు ఇవి. ఈ మాటలు వింటే ఎవరికైనా హృదయం చలించక మానదు. కానీ ఆ తండ్రి హృదయం మాత్రం కరగలేదు. ఫలితం ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకరమైన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. అయితే ప్రాణం పోవడానికి ముందు ఆ పాప మాట్లాడుతూ విడుదల చేసిన వీడియో మాత్రం అందరిని కంటతడిపెట్టిస్తోంది.

 

విజయవాడలోని దుర్గాపురంలో మాధవ శెట్టి శివకుమార్, సుమశ్రీ దంపతులు. వీరికి సాయిశ్రీ అనే చిన్నారి ఉంది. అయితే తల్లిదండ్రులు వీడిపోవడంతో సాయిశ్రీ తన తల్లితోనే ఉంటోంది. అయితే ఈ చిన్నారి గత కొంతకాలంగా క్యాన్సర్ బారిన పడటంతో చికిత్స చేయించుకుంటుంది. ఇక భర్త నుండి విడిపోయిన సుమశ్రీ పాప చికిత్స కోసం ఉన్న సొమ్మంతా ఖర్చు పెట్టింది.  మెరుగైన వైద్యం అందకపోతే పాప బ్రతకదని వైద్యులు చెప్పడంతో బెంగుళూరు తీసుకెళ్లాలనుకున్నారు. అందుకు సాయిశ్రీ పేరున తండ్రి రాసిన ఫ్లాట్‌ అయినా అమ్మి వైద్యం చేయిద్దామనుకుంది సుమశ్రీ. కానీ అది వీలుకాని పరిస్థితి. ఫ్లాట్‌ బాలిక పేరున ఉన్నా.. మైనర్‌ కావడంతో సంరక్షకుడిగా తండ్రి పేరున ఉంది. ఇక కూతురు మైనర్ కావడం...తండ్రి రౌడీ షీటర్ కావడంతో కొంత మంది ఎమ్మెల్యేల అండదండలతో ఫ్లాట్ ను కబ్జా చేయించారు. ఈ క్రమంలోనే సాయిశ్రీ తన తల్లి సుమశ్రీ దాదాపు పదిరోజులు శివకుమార్ ఇంటి చుట్టూ తిరిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ శివకుమార్ మనసు మాత్రం కరగలేదు. అదిపోగ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అరకొర వైద్యం అందడంతో సాయిశ్రీ ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఆ పాప వీడియో మాత్రం వైరల్ అయింది. వీడియో విన్న ప్రతి ఒక్కరూ పాప బాధ విని చలించిపోతున్నారు.

 

ఇదిలా ఉండగా.. తన కూతురు మరణంపై తల్లి సుమశ్రీ మాట్లాడుతూ... తన భర్త నిర్లక్ష్యం వల్లే తన కూతురు చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు క్యాన్సర్‌తో బాధపడుతున్న కన్న కుమార్తెకు సరైన వైద్యం చేయించకుండా అడ్డుపడిన భర్త శివకుమార్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.