TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మూత్రం పోశాడని చంపేశాడు..

Published on: Mon Sep 1, 2014 3:01PM

 

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని చిన్న పిల్లాడు తన ఇంటి ముందు మూత్రం పోశాడని ఆగ్రహించిన ఒక వ్యక్తి ఆ బాలుడి చెంప మీద గట్టిగా కొట్టాడు. దాంతో ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడు. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని పెద్ద హోతూరు గ్రామంలో చిన్న తిప్పన్న, గంగాధర్ అనే వ్యక్తుల ఇళ్ళు పక్కపక్కనే వున్నాయి. గంగాధర్ కుమారుడు, మూడేళ్ళ వయసున్న వినోద్ తిప్పన్న ఇంటి ముందు మూత్రం పోశాడు. అది చూసి తిప్పన్న ఆగ్రహంలో ఆ బాలుడి చెంప మీద కొట్టాడు. దాంతో వినోద్ అక్కడికక్కడే మరణించాడు.